MLC Parvartha Reddy: రోడ్డు ప్రమాదానికి గురైన ఏపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి కారు.. ఒకరి మృతి

MLC Parvartha Reddy car hit with a road accident
  • ఎమ్మెల్సీ తలకు గాయాలు.. అక్కడికక్కడే ఆయన పీఏ మృతి
  • విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తుండగా జరిగిన ప్రమాదం
  • టైరు పంక్చరై సడెన్‌గా నెమ్మదించిన లారీని వెనుక నుంచి ఢీకొట్టిన కారు
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడిచెలిక సమీపంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ యాక్సిడెంట్‌లో ఆయనకు గాయాలయ్యాయి. చంద్రశేఖర్‌రెడ్డి పీఏ ఘటనాస్థలంలోనే చనిపోయారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు ఉండగా గాయపడినవారిని నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి హుటాహుటిన తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్సీ తలకు గాయాలవడంతో ఆయనకు కూడా వైద్యం అందుతోంది. 

కాగా కారు విజయవాడ నుంచి నెల్లూరు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. కారు ముందు వెళుతున్న లారీ టైరు పంక్చరు కావడంతో ఒక్కసారిగా నెమ్మదించిందని, దీంతో లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. లారీని ఢీకొని డివైడర్‌పై పడిపోయిందని వివరించారు.
MLC Parvartha Reddy
Road Accident
Andhra Pradesh
Nellore District

More Telugu News