Parakala prabhakar: పరకాల ప్రభాకర్ కు మాతృవియోగం

Parakala Prabhakar Mother dead in Home town

  • కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కాళికాంబ
  • బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస
  • కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ కు కాళికాంబ స్వయానా అత్తగారు

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ అత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్‌ మాతృమూర్తి, మాజీ ఎమ్మెల్యే కాళికాంబ (94) బుధవారం తుదిశ్వాస విడిచారు. నార్సింగి మున్సిపాలిటీలోని మంచిరేవుల గ్రామంలో నివసిస్తున్న కాళికాంబ.. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈక్రమంలోనే బుధవారం తెల్లవారుజామున ఆమె కన్నుమూశారు. కాళికాంబ మృతిపై ఉమ్మడి ఏపీకి చెందిన పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపురం నియోజకవర్గం నుంచి 1981లో కాళికాంబ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమె భర్త పరకాల శేషావతారం ఉమ్మడి ఏపీలో రెండుసార్లు మంత్రిగా సేవలందించారు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కొడుకు పరకాల ప్రభాకర్, కోడలు నిర్మలాసీతారామన్. కాగా, బుధవారం కాళికాంబ అంత్యక్రియలు నిర్వహించారు.

Parakala prabhakar
mother death
kalikamba
Nirmala Sitharaman
Andhra Pradesh
  • Loading...

More Telugu News