CEC: ఏపీకి వస్తున్న కేంద్ర ఎన్నికల బృందం

CEC team visiting AP

  • ఈ నెల 9, 10 తేదీల్లో కేంద్ర ఎన్నికల బృందం పర్యటన
  • సీఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం
  • క్షేత్ర స్థాయిలో ఎన్నికల సన్నద్ధతపై పరిశీలన

వచ్చే ఏడాది ఏప్రిల్ లో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏపీకి రానుంది. ఈ నెల 9, 10 తేదీల్లో సీఈసీ అధికారులు ఏపీకి రానున్నారు. ఓటర్ల జాబితాలోని లోపాలు, అధికారులు సిద్ధం చేస్తున్న ఓటర్ల జాబితా, ఓటర్ల జాబితాపై ఫిర్యాదులను అధికారులు పరిశీలించనున్నారు. క్షేత్ర స్థాయిలో పూర్తి స్థాయిలో పరిశీలించనున్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కూడా వీరు భేటీ కానున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఎన్నికల ప్రక్రియతో సంబంధం ఉన్న ఇతర అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర అధికారులకు ఆదేశాలు అందాయి.

CEC
Andhra Pradesh
  • Loading...

More Telugu News