Venkatesh Daggubati: వెంకీ కెరియర్లో ప్రత్యేకం 'సైంధవ్' .. వర్కింగ్ స్టిల్స్!

Saindhav Movie Update

  • వెంకటేశ్ నుంచి వస్తున్న 'సైంధవ్'
  • కెరియర్ పరంగా ఆయనకి ఇది 75వ సినిమా
  • ఎమోషన్ తో ముడిపడిన యాక్షన్  
  • ఈ నెల 13వ తేదీన భారీ రిలీజ్


వెంకటేశ్ తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ .. వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నారు. సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో ఆయన ఇంతవరకూ 74 సినిమాలను చేశారు. 75వ సినిమాగా చేసిన 'సైంధవ్' ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 13వ తేదీన విడుదల కానుంది. శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా, యాక్షన్ - ఎమోషన్ ప్రధానంగా నడవనుంది. ఈ మధ్య కాలంలో ఈ తరహా కథల్లో వెంకటేశ్ కనిపించలేదు. అందువలన ఆయన లుక్ దగ్గర నుంచి అందరిలో ఈ సినిమా ఆసక్తిని పెంచుతోంది. ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ చూస్తే, ఈ సినిమా తప్పకుండా వెంకటేశ్ కెరియర్లో ప్రత్యేక స్థానంలో నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ ఇప్పుడు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. షూటింగు స్పాట్ లో వెంకీ .. శైలేశ్ ఏవో కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకోవడం, వెంకటేశ్ కి సీరియస్ గా ఏదో సీన్ గురించి శైలేశ్ వివరిస్తుండటం .. ఇద్దరూ లొకేషన్లో సరదాగా మాట్లాడుకోవడం .. అలా లొకేషన్ లో వాక్ చేయడం ఈ స్టిల్స్ లో కనిపిస్తోంది. సంఖ్యా పరంగా వెంకటేశ్ కి ఇది 75వ సినిమా కావడం వలన మరింత ప్రాముఖ్యతను .. ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కారణంగానే ఈ సినిమాను అత్యధిక థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు.

Venkatesh Daggubati
Shraddha Srinath
Ruhani Sharma
Saindhav

More Telugu News