YS Sharmila: కాంగ్రెస్ లో షర్మిల చేరికపై క్లారిటీ ఇచ్చిన వైఎస్సార్టీపీ ప్రధాన కార్యదర్శి

YS Sharmila is joining Congress says YSRTP leader Devender Reddy

  • షర్మిల గురువారం కాంగ్రెస్ లో చేరుతున్నారన్న దేవేందర్ రెడ్డి
  • ఏఐసీసీలో ఆమెకు కీలక పదవి దక్కే అవకాశం ఉందని వెల్లడి
  • పార్టీ నేతలకు కూడా పదవులు వస్తాయని వ్యాఖ్య

కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేరబోతున్నారనే వార్తల్లో పూర్తి క్లారిటీ వచ్చింది. ఈరోజు లోటస్ పాండ్ లోని కార్యాలయంలో పార్టీ కీలక నేతలతో షర్మిల భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో పార్టీ విలీనంపై చర్చించారు. ఈ సందర్భంగా వైఎస్సార్టీపీ ప్రధాన కార్యదర్శి తూడి దేవేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... గురువారం నాడు కాంగ్రెస్ లో షర్మిల చేరుతున్నారని చెప్పారు. ఆమెకు ఏఐసీసీలో కీలక పదవి దక్కే అవకాశం ఉందని అన్నారు. పార్టీలోని నేతలకు కూడా పదవులు వస్తాయని చెప్పారు. 

మరోవైపు, ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు షర్మిలకు అప్పజెప్పనున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) కూడా షర్మిలతో కలిసి నడుస్తానని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

More Telugu News