Heart Attack: చలికాలంలో గుండెపోటు ముప్పు యువకులకే ఎక్కువ.. నిపుణుల హెచ్చరిక

Heart Attack Cases Raising In Youth Due to Cold Weather

  • జీవనశైలికి తోడు చలి ప్రభావంతో పెరుగుతున్న గుండెపోటు బాధితులు
  • ఈ సీజన్ లో వాయు కాలుష్యం పెరగడమూ ఓ కారణమేనట
  • గుండె జబ్బులను ప్రేరేపిస్తున్న ఇన్ ఫ్లూయెంజా, ఉబ్బసం, కరోనా

చలికాలంలో గుండెపోటు బాధితుల సంఖ్య పెరుగుతోందని మాక్స్ హాస్పిటల్ కార్డియాలజీ ఛైర్మన్ డాక్టర్ బల్బీర్ సింగ్ పేర్కొన్నారు. జీవనశైలిలో మార్పులకు ఈ సీజన్ లో కలిగే మార్పులు తోడవడంతో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయని వివరించారు. చల్లని వాతావరణం, ఇన్ ఫ్లూయెంజా, ఉబ్బసం, కరోనా తదితర అనారోగ్య సమస్యలతో గుండెపోటు ముప్పు పెరుగుతోందన్నారు. ప్రస్తుతం ఆసుపత్రికి గుండెపోటు కేసులు రోజుకు ఒకటి రెండు వస్తున్నాయని, అందులో యువతే ఎక్కువగా ఉంటున్నారని చెప్పారు. చలి కారణంగా గుండెపై ఒత్తిడి పెరుగుతుందన్నారు.

గుండెకు రక్తాన్ని చేరవేసే నాళాలు కుచించుకుపోతాయని, దీంతో రక్తసరఫరా సరిగా లేక గుండె పనితీరులో మార్పులు చోటుచేసుకుంటాయని డాక్టర్ బల్బీర్ సింగ్ తెలిపారు. మరోవైపు, ఈ సీజన్ లో వాయు కాలుష్యం పెరుగుతుందని ఆయన గుర్తుచేశారు. గుండె పోటుకు ఇది కూడా ఓ కారణమని చెప్పారు. వీటతో పాటు గుండెపోటుకు ధూమపానం, మద్య పానం, శారీరక వ్యాయామం లేకపోవడం తదితర కారణాలు కూడా ఉన్నాయని డాక్టర్ బల్బీర్ సింగ్ వివరించారు.

  • Loading...

More Telugu News