Robo Hotel: బిర్యానీ తిని రూ. 7 లక్షల విలువైన కారు గెలుచుకున్న అదృష్టవంతుడు!

Tirupati Man ate biryani and win Nissan Magnite car
  • గత రాత్రి లక్కీ డ్రా నిర్వహించిన రోబో హోటల్
  • నిరుడు సెప్టెంబర్ ప్రత్యేక పథకం పెట్టిన హోటల్ యజమాని భరత్‌కుమార్‌రెడ్డి
  • 23 వేలకుపైగా కూపన్ల అందజేత
  • నిస్సాన్ మాగ్నైట్ కారు గెలుచుకున్న రాహుల్
తిరుపతిలోని ఓ హోటల్‌లో బిర్యానీ తిన్న వారికి నిర్వహించిన లక్కీ డ్రాలో ఓ వ్యక్తి ఏకంగా రూ. 7 లక్షల విలువైన నిస్సాన్ మాగ్నైట్ కారును గెలుపొందాడు. నగరంలోని రోబో హోటల్ నిరుడు సెప్టెంబర్‌లో తమ హోటల్‌లో బిర్యానీ తిన్న ప్రతి ఒక్కరికీ కూపన్ ఇచ్చింది. ఇలా ఏకంగా 23 వేలకు పైగా కూపన్లు అందించింది.

కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని గత రాత్రి హోటల్ అధినేత భరత్‌కుమార్‌రెడ్డి, నీలిమ దంపతులు హోటల్ ఆవరణలో లక్కీ డ్రా తీశారు. ఇందులో నగరానికే చెందిన రాహుల్ విజేతగా నిలిచాడు. ఆ వెంటనే రాహుల్‌కు ఫోన్ చేసి విషయం చెప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భరత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇకపైనా ఇలాంటి పథకాలు కొనసాగిస్తామని తెలిపారు.
Robo Hotel
Tirupati
Biryani
Nissan Magnite

More Telugu News