PM Modi: అయోధ్యలో సామాన్యురాలి ఇంటికి వెళ్లి చాయ్ తాగిన ప్రధాని మోదీ

PM Modi drinks Tea at a woman house in Ayodhya

  • జాతీయస్థాయిలో పీఎం ఉజ్వల పథకం అమలు
  • 10 కోట్లవ లబ్దిదారుగా అయోధ్యకు చెందిన మీరా
  • మీరా ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను సర్ ప్రైజ్ చేసిన ప్రధాని 

కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో పీఎం ఉజ్వల పథకం అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా అయోధ్యలో పర్యటించిన ప్రధాని మోదీ ఉజ్వల పథకంలో 10 కోట్లవ లబ్దిదారు అయిన మీరా అనే మహిళ ఇంటికి వెళ్లి ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రధాని మోదీ అంతటివాడు తమ ఇంటికి రావడంతో మీరా, ఆమె భర్త సూరజ్, వారి పిల్లల ఆనందం అంతా ఇంతా కాదు. ఈ సందర్భంగా మీరా ఇంట్లో ప్రధాని టీ తాగారు. మీరా కుటుంబ సభ్యులతో ఆయన సరదాగా ముచ్చటించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. బీజేపీ మద్దతుదారులు ఈ వీడియోను విపరీతంగా లైక్ చేస్తున్నారు.

PM Modi
Meera
Tea
Ayodhya
PM Ujwal
BJP

More Telugu News