MS Dhoni: పాకిస్థాన్ లో ఫుడ్ సూపర్... ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలి: ధోనీ

Dhoni praises Pakistani food

  • పాకిస్థానీ వంటకాలపై మనసు పారేసుకున్న ధోనీ
  • ధోనీ వ్యాఖ్యల వీడియో వైరల్
  • ధోనీ కామెంట్స్ తో పొంగిపోతున్న పాకిస్థానీలు

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తాను మంచి భోజనప్రియుడ్నని చాటుకున్నారు. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో ధోనీ పాకిస్థానీ వంటకాలను ప్రశంసించడం కనిపించింది. 

రుచికరమైన ఆహారం కావాలంటే ఒక్కసారైనా పాకిస్థాన్ వెళ్లాలి అని ధోనీ ఆ వీడియోలో చెప్పాడు. అయితే, అవతలి వ్యక్తి మాత్రం... నాకు మంచి ఫుడ్ అంటే ఇష్టమే. కానీ అక్కడికి (పాకిస్థాన్ కు) మాత్రం వెళ్లను. మీరు అక్కడ మంచి వంటకాలు దొరుకుతాయని చెప్పినా సరే... నేను వెళ్లను అని చెప్పడం కూడా ఆ వీడియోలో వినిపించింది. 

ధోనీ నోట పాకిస్థాన్ పేరు వినపడడం ఆలస్యం... పాకిస్థాన్ క్రికెట్ ప్రముఖులు, పాకిస్థాన్ అభిమానులు "మహీ భాయ్ నువ్వు సూపర్... లవ్యూ మహీ భాయ్" అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. 

పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ క్రీడా యాంకర్ ఫఖార్-ఈ-ఆలమ్ అయితే... "మా హృదయాలను గెలుచుకున్నావు ధోనీ భాయ్... నువ్వు కూడా మాతో కలిసి పెవిలియన్ లో ఉండుంటే బాగుండేది... క్రికెట్ కోసం మాత్రమే కాదు ఫుడ్ కోసం కూడా" అంటూ తన అభిమానాన్ని చాటుకున్నాడు.

More Telugu News