Inter Exams: తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫీజు గడువు తేదీ పెంపు

Inter Exams Fee Due Date Extended by Intermediate board

  • జనవరి 3 వరకు పొడగించిన ఇంటర్మీడియెట్ బోర్డు
  • రూ.2500 అపరాధ రుసుముతో చెల్లించాలని వెల్లడి
  • కీలక ప్రకటన చేసిన ఇంటర్మీడియెట్ బోర్డు

తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ పరీక్ష ఫీజు గడువు తేదీని జనవరి 3 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపింది. రూ.2500 అపరాధ రుసుముతో విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చని స్పష్టం చేసింది. ఇంటర్మీడియెట్‌ మొదటి, ద్వితీయ సంవత్సరాల జనరల్‌, ఒకేషనల్‌ విభాగాలకు చెందిన విద్యార్థులు అపరాధ రుసుముతో కలిపి ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. కాగా ఇప్పటిదాకా 9,77,040 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారని తెలిపింది. ఇంటర్‌ కోర్సుల్లో మొత్తం 10,59,233 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారని ప్రస్తావించింది.

More Telugu News