Stock Market: 2023ను నష్టాలతో ముగించిన స్టాక్ మార్కెట్లు

markets ends in losses

  • లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు
  • 170 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 47 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

2023 చివరి ట్రేడింగ్ రోజున స్టాక్ మార్కెట్లు నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈ ఏడాదిని మార్కెట్లు నష్టాలతో ముగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 170 పాయింట్లు నష్టపోయి 72,240కి దిగజారింది. నిఫ్టీ 47 పాయింట్లు కోల్పోయి 21,731కి పడిపోయింది. ఈ ఏడాది చివరి సెషన్ ను మార్కెట్లు లాభాలతోనే ప్రారంభించాయి. అయితే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (3.52%), నెస్లే ఇండియా (1.35%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.12%), టాటా స్టీల్ (0.98%), బజాజ్ ఫైనాన్స్ (0.76%). 

టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.41%), ఇన్ఫోసిస్ (-1.29%), టైటాన్ (-1.09%), టెక్ మహీంద్రా (-1.05%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.03%).

More Telugu News