Daggubati Purandeswari: భూమన కరుణాకర్ రెడ్డి అన్యమతస్తుడు: పురందేశ్వరి

Purandeswari fires on Bhumana Karunakar Reddy

  • తిరుమలలో భక్తులకు సరైన సేవలు అందడం లేదన్న పురందేశ్వరి
  • టీటీడీ నిర్లక్ష్యంపై పోరాటం చేస్తామని హెచ్చరిక
  • జగన్ ది స్టిక్కర్ల ప్రభుత్వమని విమర్శ

టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్యమతస్తుడని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇతర మతానికి చెందిన వ్యక్తి కావడం వల్లే తిరుమలలో భక్తులకు సరైన సేవలు అందడం లేదని విమర్శించారు. టీటీడీ నిధులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. టీటీడీ నిర్లక్ష్యంపై బీజేపీ పోరాటం చేస్తుందని చెప్పారు. జగన్ ది స్టిక్కర్ల ప్రభుత్వమని... కేంద్ర ప్రభుత్వ నిధులను పక్కదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. అమలాపురంలో బీజేపీ కార్యాలయాన్ని ఈరోజు ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

Daggubati Purandeswari
BJP
Bhumana Karunakar Reddy
YSRCP
TTD
Tirumala
  • Loading...

More Telugu News