Pawan Kalyan: నేటి నుంచి కాకినాడ జిల్లాలో పర్యటించనున్న పవన్

Pawan Kalyan to stay in Kakinada for 3 days
  • ఈరోజు 7 నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించనున్న పవన్
  • టీడీపీతో కలిసి పని చేసేలా శ్రేణులను సిద్ధం చేయనున్న జనసేనాని
  • డ్వాక్రా, ప్రజా సంఘాలతో భేటీ కానున్న పవన్
జనసేనాని పవన్ కల్యాణ్ నేటి నుంచి మూడు రోజుల పాటు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. కాకినాడ విద్యుత్ నగర్ లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఆయన బస చేశారు. ఈరోజు కాకినాడ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. నియోజకవర్గాల్లో టీడీపీతో సమన్వయం చేసుకుని పని చేసేలా దిశానిర్దేశం చేయనున్నారు. వివిధ ప్రజా సంఘాలు, డ్వాక్రా సంఘాలతో కూడా ఆయన ముఖాముఖి నిర్వహించనున్నారు. తొలి విడత వారాహి యాత్రను కూడా ఆయన కాకినాడ నుంచే ప్రారంభించడం గమనార్హం. నియోజకవర్గాల సమీక్షను కూడా ఇప్పుడు ఆయన ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు.
Pawan Kalyan
Janasena
Kakinada

More Telugu News