Amit Shah: ఎల్లుండి హైదరాబాద్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Amit Shah to visit Hyderabad on December 28

  • డిసెంబర్ 28 మధ్యాహ్నం 12.05 గంటలకు శంషాబాద్‌కు అమిత్ షా
  • మధ్యాహ్నం నోవాటెల్ హోటల్‌లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం
  • మధ్యాహ్నం కొంగరకలాన్‌లో పార్టీ విస్తృతస్థాయి సమావేశం

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎల్లుండి హైదరాబాద్ రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైంది. డిసెంబర్ 28న మధ్యాహ్నం 12.05 గంటలకు ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి నోవాటెల్ హోటల్‌కు వెళతారు. మధ్యాహ్నం 12.20 గంటల నుంచి 1.45 గంటల వరకు పార్టీ ముఖ్యనేతలతో సమావేశమవుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.50 గంటలకు కొంగరకలాన్‌లో జరగనున్న పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై సమీక్షిస్తారు. అదే సమయంలో రానున్న లోక్ సభ ఎన్నికలకు పార్టీ కేడర్‌ను సమాయత్తం చేసేందుకు దిశానిర్దేశనం చేయనున్నారు.

  • Loading...

More Telugu News