Lorry Drivers: రాత్రివేళ లారీ డ్రైవర్లకు ఉచితంగా టీ పంపిణీ.. ఒడిశా సర్కారు నిర్ణయం

Lorry Drivers to be served free tea on NHs during night in Odisha

  • హోటళ్లు, దాబాల్లో ఉచితంగా టీ పంపిణీ చేయాలని నిర్ణయం
  • ఆ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్న మంత్రి టుకుని సాహు
  • 30 జిల్లాల్లో లారీ టెర్మినళ్ల నిర్మాణం.. అందులో సకల సౌకర్యాలు

నిర్ణీత సమయానికి సరుకు డెలివరీ చేసేందుకు లారీ డ్రైవర్లు పడే శ్రమ అంతాఇంతా కాదు. కొన్నిసార్లు నిద్రాహారాలు మాని మరీ డ్రైవ్ చేస్తూ ఉంటారు. రాత్రివేళ కూడా విశ్రాంతి లేకుండా లారీ తోలడం వల్ల కొన్నిసార్లు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో రాత్రివేళ కాసేపు విశ్రాంతి తీసుకుని వెచ్చగా కాస్తంత చాయ్ కడుపులో పోసుకుని, తిరిగి లారీ ఎక్కేలా ఒడిశా ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని ప్రకటించింది. 

రాత్రుళ్లు రాకపోకలు సాగించే లారీ డ్రైవర్లకు హోటళ్లు, దాబాలలో ఉచితంగా టీ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి టుకుని సాహు వెల్లడించారు. రాత్రివేళ డ్రైవర్లు టీ తాగి కాసేపు విశ్రాంతి తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని 30 జిల్లాల్లో లారీ టెర్మినళ్లు నిర్మిస్తామని, వాటిలో డ్రైవర్లు నిద్రపోవడానికి, స్నానాలకు సౌకర్యాలు ఉంటాయని పేర్కొన్నారు. అక్కడ కూడా చాయ్, కాఫీ వంటివి అందుబాటులో ఉంటాయని మంత్రి వివరించారు.

  • Loading...

More Telugu News