Dhootha: 'దూత' సిరీస్ కి ప్రత్యేకమైన ఆకర్షణ ఆమెనే!

Dhootha Web Series Update

  • అమెజాన్ ప్రైమ్ లో 'దూత'
  • కథాకథనాలతో మెప్పించిన సిరీస్
  • డీసీపీ పాత్రలో ఆకట్టుకున్న పార్వతి తిరువోతు
  • ఆమె నటనే ఈ సిరీస్ కి హైలైట్ అంటున్న ఆడియన్స్


ఈ మధ్య కాలంలో వచ్చిన తెలుగు వెబ్ సిరీస్ లలో 'దూత' ప్రత్యేకమైన స్థానంలో కనిపిస్తుంది. అందుకు కారణం దర్శకుడిగా విక్రమ్ కుమార్ కథను అల్లిన తీరు .. కథనాన్ని నడిపించిన విధానం అనే చెప్పాలి. హారర్ తో కూడిన మిస్టీరియస్ థ్రిల్లర్ జోనర్లో నడిచిన ఈ సిరీస్, 'అమెజాన్ ప్రైమ్'లో అందుబాటులో ఉంది. చైతూ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, ఆయన భార్యగా ప్రియా భవాని శంకర్ కనిపిస్తుంది.  కథాకథనాల పరంగా .. విక్రమ్ కుమార్ టేకింగ్ పరంగా ఈ సిరీస్ మెప్పిస్తుంది. అలాంటి ఈ సిరీస్ కి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది పార్వతి తిరువోతు. ఈ సిరీస్ లో ఆమె డీసీపీ క్రాంతిగా కనిపిస్తుంది. వరుస హత్యలకు సంబంధించి, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా ఆమె రంగంలోకి దిగుతుంది. ఎదుటివ్యక్తిని కళ్లతో చూస్తూనే చదివేసే పాత్రకి ఆమె జీవం పోషించింది. విశాలమైన ఆమె కళ్లు ఈ పాత్రకి మరింత హెల్ప్ అయ్యాయి. ఎలాంటి పరిస్థితి ఎదురైనా తడబడకుండా .. నిలకడగా .. నిబ్బరంగా సమస్యను పరిష్కరించే ఆఫీసర్ ఆమె. ధైర్యం .. హుందాతనం కలిగిన బాడీ లాంగ్వేజ్ తో ఆమె ఈ పాత్రకి మరింత వన్నె తీసుకొచ్చింది. ఈ సిరీస్ చూసిన వాళ్లంతా ఆమె నటన హైలైట్ అనే రాసుకుంటూ .. చెప్పుకుంటూ వస్తున్నారు. మలయాళంలో 2006 నుంచి నటిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆమె, తమిళ .. కన్నడ సినిమాల్లోను నటిస్తోంది. ఉత్తమనటిగా అనేక అవార్డులను అందుకున్న ఆమె, ఇకపై తెలుగు సినిమాల్లోను కనిపించే అవకాశాలు ఉన్నాయి.

Dhootha
Nagachaitanya
Priya Bhavani Shankar
Parvathi Thiruvothu
  • Loading...

More Telugu News