Bigg Boss: వాళ్లంతా కూడబలుక్కుని ఆడుతుంటే చూస్తూ కూర్చోడానికి నేనేమైనా పిచ్చోడినా?: శివాజీ

Shivaji Interview

  • అమర్ ను టార్గెట్ చేయలేదన్న శివాజీ 
  • అతను చాలా టాలెంటెడ్ అంటూ కితాబు 
  • తన గురించి నెగెటివ్ గా ప్రచారం చేశారని వ్యాఖ్య 
  • ఈ షోకి తానే హీరోనని స్పష్టీకరణ  


బిగ్ బాస్ సీజన్ 7లో టాప్ త్రీ పొజిషన్లో శివాజీ నిలిచాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "అమర్ ను నేను టార్గెట్ చేశానని అంటున్నారు .. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదు. అమర్ .. నేను మంచి ఫ్రెండ్స్. తను మంచి టాలెంటెడ్ .. డాన్సర్ .. కామెడీ టైమింగ్ ఉన్నవాడు. అలాంటివాడు అనవసరంగా టైమ్ వేస్టు చేస్తున్నాడే అనుకున్నాను" అని అన్నారు. 

"అమర్ కెప్టెన్ కాకుండా నేను ఎప్పుడూ ఆపలేదు. అతని పట్ల సానుభూతి కోసం కొంతమంది నాపై నెగెటివ్ గా ప్రచారం చేశారని నాకు అనిపిస్తోంది. నేను ఎవరిని నామినేట్ చేసినా అందుకు రీజన్ ఉంది. సిల్లీ రీజన్స్ తో పాతవి తవ్వుకుని కొంతమంది నన్ను నామినేట్ చేశారు. అలాంటి పరిస్థితుల్లో నేనూ అదే పని చేశాను. అలాంటి సమయంలో నేను బుద్ధుడిలా చూస్తూ కూర్చోలేనుగదా" అంటూ అసహనాన్ని ప్రదర్శించారు.  

" కొంతమంది నా ఎదురుగానే మిగతా వారిని చులకన చేస్తూ .. ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. అలాంటివారి ధోరణిని నేను తప్పుబట్టాను. వాళ్లంతా కూడబలుక్కుని ఆడటానికి వస్తే, చూస్తూ కూర్చోడానికి నేనేమైనా పిచ్చోడినా?. ఇలాంటి ఆటలు చాలా చూసిన తరువాతనే ఇక్కడికి వచ్చాను. నా బౌండరీ నేను దాటలేదు .. అందువల్లనే నేను 15 వారాలు లోపల ఉండగలిగాను. ఈ షోకి శివాజీ హీరో" అని అన్నారు. 

Bigg Boss
Shivaji
Amar
Sobha
  • Loading...

More Telugu News