Naga Suseela: నాన్న బయోపిక్ లో నాగార్జున చేస్తేనే బాగుంటుంది: నాగసుశీల

Naga Suseela Interview

  • అక్కినేని గురించి ప్రస్తావించిన నాగసుశీల
  • ఆయన కోపం తమకి తెలియదని వివరణ
  • తెరపై ఆయనను కొట్టినా తట్టుకోలేనని వ్యాఖ్య  
  • మనవళ్లతో చనువుగా ఉండేవారని వెల్లడి


అక్కినేని నాగేశ్వరరావు కూతురు నాగసుశీల తాజాగా 'మహా మ్యాక్స్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "పెళ్లైన కొత్తలో నాన్నకి చాలా కోపం ఉండేదని అమ్మ చెబుతూ ఉండేది. మాకు ఊహ తెలిసిన తరువాత ఆయన కోపంగా ఉండటం మేము చూడలేదు. ఎప్పుడూ సరదాగానే మాట్లాడుతూ ఉండేవారు" అని అన్నారు. 

" వేసవి సెలవుల్లో నాన్నగారి సినిమాల షూటింగులకు వెళ్లేవాళ్లం. అప్పట్లో ఊటీలో ఎక్కువగా షూటింగ్స్ జరుగుతూ ఉండేవి. ఇక నాన్నగారి సినిమాలు చాలా వరకూ నేను పూర్తిగా చూడలేదు. ఎందుకంటే తెరపై ఆయనని ఎవరైనా కొడుతూ ఉంటే నేను చూడలేకపోయేదానిని. ఇక బయట కూడా నాన్నను ఎవరైనా ఏమైనా అంటే అస్సలు సహించేదానిని కాదు" అని అన్నారు. 

"అనారోగ్య కారణాల వలన అమ్మ వేటిపైనా కూడా పెద్దగా శ్రద్ధ చూపించేది కాదు. ఇప్పుడు ఎందుకులే అని ఆమె అన్నవన్నీ, నాన్న నాతోనే చెప్పించి ఒప్పించేవారు. ఇక మాకంటే కూడా మనవళ్లతో ఆయన ఎక్కువ చనువుగా ఉండేవారు. నాన్న బయోపిక్ గురించిన ప్రస్తావన ఇంతవరకూ నా దగ్గర ఎవరూ చేయలేదుగానీ, ఒకవేళ తీస్తే ఆ పాత్రను నాగార్జున చేస్తేనే బాగుంటుంది" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

More Telugu News