Raghu Rama Krishna Raju: నారా లోకేశ్ పై ప్రశంసలు కురిపించిన రఘురామకృష్ణరాజు
![Raghu Rama Krishna Raju praises Nara Lokesh](https://imgd.ap7am.com/thumbnail/cr-20231220tn6582b37c9ae67.jpg)
- యువగళం పాదయాత్ర పెను తుపానుగా మారిందన్న రఘురాజు
- లోకేశ్ లో ప్రజలు మంచి నాయకుడిని చూస్తున్నారని ప్రశంస
- యువగళం విజయోత్సవ సభ సక్సెస్ కావాలని ఆకాంక్ష
కుప్పంలో చిరుజల్లుగా ప్రారంభమైన నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పెను తుపానుగా మారిందని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. పాదయాత్ర ప్రారంభంలో మైక్ లాగేశారని, వాహనాలు సీజ్ చేశారని విమర్శించారు. నాలుగు రోజులు మాత్రమే నడుస్తారని ఎద్దేవా చేశారని... ఎన్ని అవాంతరాలను సృష్టించినా గాంధేయ మార్గంలో లోకేశ్ ముందుకు సాగారని కితాబునిచ్చారు. తండ్రిని అరెస్ట్ చేసినా లోకేశ్ ముందుకు సాగుతూ వెళ్లారని చెప్పారు. లోకేశ్ లో ప్రజలు ఒక మంచి నాయకుడిని చూస్తున్నారని తెలిపారు. యువగళం పాదయాత్ర విజయోత్సవ సభకు చంద్రబాబు, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ వస్తున్నారని... సభ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.