Ambati Rambabu: ఎర్ర బుక్ కాపీని ఆ యాంకర్ కు కూడా ఇవ్వు లోకేశ్!: మంత్రి అంబటి

Minister Ambati Rambabu satires on Lokesh

  • పాదయాత్రలో కొందరు అధికారులు, పోలీసుల పేర్లను ఎర్ర బుక్ లో రాసుకున్న లోకేశ్
  • ఆ బుక్ ఒరిజినల్ ను వాళ్ల నాన్నకు ఇస్తాడంట అంటూ అంబటి వ్యంగ్యం
  • పవన్ కల్యాణ్ ను యాంకర్ గా పేర్కొన్న వైనం

యువగళం పాదయాత్ర సందర్భంగా కొందరు అధికారులు, పోలీసుల పేర్లను నారా లోకేశ్ ఓ ఎర్ర పుస్తకంలో రాసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. 

"ఎర్ర బుక్ అంట. అందులో పేర్లు రాసుకున్నాడంట. ఆ బుక్ ఒరిజినల్ కాపీని వాళ్ల నాన్న గారికి ఇస్తాడంట... ఒక కాపీ తన వద్ద ఉంచుకుంటాడంట. ఇంకో కాపీ ఆ యాంకర్ కు కూడా ఇవ్వవయ్యా! పవన్ కల్యాణ్ యాంకర్ గా వస్తున్నాడు కదా... ఆయనకు కూడా ఇస్తే బాగుంటుంది! ఆయన కూడా నీ భాగస్వామే అన్నావుగా! 

నీ దుంపతెగ... తెలుగుదేశం పార్టీ  తెల్లజెండా ఎత్తేంత వరకు మన లోకేశ్ బాబు నిద్రపోయేట్టు లేడు! తెల్లజెండా ఎత్తిన తర్వాతే ఆయన నిద్రపోతాడు! నేను ఎప్పుడో చెప్పాను... లోకేశ్ బాబు ఒక ఐరన్ లెగ్. అతడు కాలు పెట్టాడు... తెలుగుదేశం కుంగింది... యువగళం పాదయాత్ర చేశాడు... తెలుగుదేశం ఇంకా కుంగింది" అంటూ ఎద్దేవా చేశారు. 

అంతేకాదు, చంద్రబాబు భలే యాంకర్లను సెట్ చేశాడంటూ అంబటి రాంబాబు వ్యంగ్యం ప్రదర్శించారు.

More Telugu News