Siddaramaiah: కేటీఆర్‌కు కర్ణాటక సీఎం సిద్దరామయ్య కౌంటర్‌

Karnataka CM Siddaramaiah satire to KTR
  • సిద్ధరామయ్య మాట్లాడుతున్నట్టుగా ఉన్న వీడియోను షేర్ చేసిన కేటీఆర్
  • అది ఫేక్ వీడియో అన్న సిద్ధరామయ్య
  • బీజేపీకి నిజమైన బీ టీమ్ బీఆర్ఎస్ అని విమర్శ
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి డబ్బులు లేవంటూ కర్ణాటక అసెంబ్లీలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. తెలంగాణ భవిష్యత్తు కూడా ఇంతేనేమో అని సెటైర్ వేశారు. దీనిపై సిద్ధరామయ్య ఘాటుగా రియాక్ట్ అయ్యారు. 

కేటీఆర్ షేర్ చేసిన వీడియో ఫేక్ అని సిద్దరామయ్య కొట్టిపడేశారు. 'కేటీఆర్.. తెలంగాణ ఎన్నికల్లో మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో తెలుసా?' అని ఆయన ప్రశ్నించారు. ఏది ఫేక్ వీడియోనో, ఏది ఒరిజినల్ వీడియోనో కూడా మీరు తేల్చుకోలేకపోతున్నారు అని ఎద్దేవా చేశారు. ఫేక్ వీడియోలను బీజేపీ సృష్టిస్తుందని... వాటిని మీరు ప్రచారంలోకి తెస్తారని విమర్శించారు. బీజేపీకి నిజమైన బీ టీమ్ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు.
Siddaramaiah
Congress
KTR
BRS

More Telugu News