Revanth Reddy: పారిశ్రామిక వాడల కోసం 1000 ఎకరాల భూములు గుర్తించండి: అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశం

CM Revanth Reddy orders to find 1000 acres of land

  • విమానాశ్రయాలకు, జాతీయ రహదారులకు 100 కి.మీ. లోపు ఉండేలా చూడాలని సూచన
  • బంజరు భూములై ఉండటంతో పాటు సాగుకు యోగ్యం కానివై ఉండాలన్న సీఎం
  • కాలుష్యరహిత పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ముఖ్యమంత్రి

తెలంగాణలో నూతన పారిశ్రామిక వాడల ఏర్పాటు కోసం ఓఆర్ఆర్‌కు వెలుపల, ఆర్ఆర్ఆర్‌కు లోపల 500 నుంచి 1000 ఎకరాల భూమిని గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం అధికారులను ఆదేశించారు. ఆ భూములు కూడా విమానాశ్రయాలకు, జాతీయ రహదారులకు వంద కిలో మీటర్ల లోపు ఉండేలా చూడాలని సూచించారు. 

రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిపై సోమవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... పరిశ్రమల కోసం సేకరించే భూములు బంజరు భూములై ఉండటంతో పాటు సాగుకు యోగ్యం కానివి అయి ఉండాలన్నారు.

రైతులకు ఎలాంటి నష్టం లేకుండా... కాలుష్యం తక్కువగా ఉండేవిధంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందన్నారు. అదే సమయంలో పరిశ్రమలకు కేటాయించినప్పటికీ... ఉపయోగించకుండా ఉన్న వాటిపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. కాలుష్యరహిత పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలని, హైదరాబాద్‌లోని నాచారం, జీడిమెట్ల, కాటేదాన్ తదితర పారిశ్రామికవాడల విషయంలో ప్రత్యామ్నాయాలను సూచించాలన్నారు.

  • Loading...

More Telugu News