Jagan: ప్రతీ ఇంటా ఈ రెండు యాప్‌లు ఉండాలి: సీఎం జగన్‌

CM Jagan on Arogya Sree

  • ప్రతి పేద కుటుంబానికి ఆరోగ్యశ్రీ ఉండాలనేదే తమ లక్ష్యమన్న సీఎం
  • ఈరోజు నుంచి ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతుందని వెల్లడి
  • 1.4 కోట్ల మందిని ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చామని వ్యాఖ్య

పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ఒక వరమని... ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఆరోగ్యశ్రీ ఉండాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఆరోగ్యశ్రీని పేదవాడికి మరింత చేరువ చేసేందుకే అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం కింద పేదవాడికి ఖరీదైన వైద్యాన్ని అందిస్తున్నామని... వైద్య ఖర్చు రూ. 1,000 దాటితే ఆరోగ్యశ్రీ కిందకు వస్తుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 25 లక్షలకు పెంచుతున్నామని తెలిపారు. 

ఈరోజు నుంచి కొత్త ఫీచర్లతో కూడిన ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతుందని జగన్ చెప్పారు. క్యూఆర్ కోడ్ కలిగిన ఈ కార్డులో లబ్ధిదారుని ఫొటో, ఆరోగ్య వివరాలు ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలోని 1.4 కోట్ల మందిని ఈ పథకం కిందకు తీసుకొచ్చామని చెప్పారు. ప్రతి ఇంట్లో దిశ, ఆరోగ్యశ్రీ యాప్ లు ఉండాలని సూచించారు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన వారికి మందులు ఉచితంగా డోర్ డెలివరీ చేస్తామని చెప్పారు. క్యాన్సర్ వంటి వ్యాధులకు కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేశామని అన్నారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కోసం ఏటా రూ. 1,000 కోట్లు కూడా ఖర్చు చేసేది కాదని... తమ ప్రభుత్వం ఏటా రూ. 4,100 కోట్లను ఖర్చు చేస్తోందని చెప్పారు.

  • Loading...

More Telugu News