Ambati Rambabu: పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి సెటైర్

Minister Ambati Rambabu satires on Pawan Kalyan

  • టీడీపీతో పొత్తు పదేళ్లు కొనసాగాలనుకుంటున్నామన్న పవన్
  • రాష్ట్రం బాగుపడాలంటే పొత్తు కొనసాగాలని స్పష్టీకరణ
  • మూడు ముళ్లు మాత్రం మూడు రోజుల్లో తెంచేస్తావ్ అంటూ అంబటి వ్యంగ్యం

ఏపీలో టీడీపీతో పొత్తు పదేళ్లయినా కొనసాగాలని కోరుకుంటున్నామని, రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఏపీ బాగుపడాలంటే తమ పొత్తు కొనసాగాలని జనసేనాని పవన్ కల్యాణ్ నిన్న వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. టీడీపీతో అలయన్స్ దశాబ్దకాలం కావాలంటావ్... మూడు ముళ్లు మాత్రం మూడు రోజుల్లో తెంచేస్తావ్... అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 

2014లో టీడీపీకి మద్దతిచ్చిన జనసేన పార్టీ... 2019లో విడిపోయింది. ఇప్పుడు మళ్లీ టీడీపీతో చేయి కలిపిన నేపథ్యంలో వైసీపీ నేతలు పవన్ కల్యాణ్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. నిన్న సీఎం జగన్ కూడా శ్రీకాకుళం జిల్లాలో పవన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ పేరెత్తకుండా దత్తపుత్రుడు అంటూ విరుచుకుపడ్డారు.

Ambati Rambabu
Pawan Kalyan
YSRCP
Janasena
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News