Jagan: జగన్ అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

AP Cabinet meeting started

  • సెక్రటేరియట్ లోని తొలి బ్లాక్ లో మంత్రివర్గ సమావేశం
  • కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు తదితర అంశాలపై చర్చించే అవకాశం
  • ఎన్నికల నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్న కేబినెట్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమయింది. సెక్రటేరియట్ లోని మొదటి బ్లాక్ లో మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోనున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో పలు ప్రజాకర్షక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది. పెన్షన్ ను రూ. 3 వేలకు పెంచడం, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 25 లక్షలను పెంచడం, కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడం, తుపాను నష్టం, నష్టపోయిన రైతులకు ప్రభుత్వ సాయం, ఇంటి పట్టాలు, ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు జనవరిలో కేటాయించాల్సిన నిధులు, తెలంగాణతో నీటి పంపకాల వివాదం తదితర కీలక అంశాలపై చర్చించనున్నారు.

Jagan
YSRCP
Andhra Pradesh
Cabinet Meeting
  • Loading...

More Telugu News