Budda Venkanna: పులివెందులలో జగన్ ను ఓడిస్తాం: బుద్దా వెంకన్న

We will defeat Jagan in Pulivendula

  • రాయలసీమ ప్రజలు జగన్ ను నమ్మడం లేదన్న బుద్ధా వెంకన్న
  • రైతుల బాధలు పట్టించుకోకుండా మంత్రులు బస్సు యాత్రలు చేస్తున్నారని మండిపాటు
  • వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని ధీమా

ఏపీలో వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం అసంభవమని టీడీపీ నేత, పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జీ బుద్దా వెంకన్న అన్నారు. పులివెందులలో కూడా ముఖ్యమంత్రి జగన్ ను ఓడిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ప్రజలు జగన్ ను నమ్మడం లేదని... ఈ విషయం ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో అర్థమవుతోందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించి... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాడేపల్లి, ఇడుపులపాయ ప్యాలస్ లలో జగన్ దాచుకున్న డబ్బును బయటకు తీస్తామని వెంకన్న తెలిపారు. తుపాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయి కంటతడి పెడుతుంటే... మంత్రులు మాత్రం హాయిగా బస్సు యాత్రలు చేసుకుంటున్నారని విమర్శించారు. రైతుల బాధలను మంత్రులు వినాలని చెప్పారు. జగన్ తాడేపల్లి ప్యాలస్ లో మెద్దునిద్ర పోతుంటే... రైతు సమస్యలను చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. జగన్ పాలనలో కేవలం విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు మాత్రమే బాగుపడ్డారని దుయ్యబట్టారు.

Budda Venkanna
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
  • Loading...

More Telugu News