Ayyanna Patrudu: చిత్తుగా ఓడిపోయే సీట్లని బీసీలకు కట్టబెట్టి.. బీసీలను బలిపశువులను చెయ్యాలని జగన్ చూస్తున్నాడు: అయ్యన్నపాత్రుడు

Jagan is giving loosing seats to BCs says Ayyanna Patrudu

  • జగన్ పై అయ్యన్నపాత్రుడు మరోసారి విమర్శలు
  • పీకే చిట్టా ప్రకారం ఓడిపోయే సీట్లను బీసీలకు ఇస్తున్నాడని మండిపాటు
  • బీసీలపై జగన్ కసి ఇంకా చల్లారలేదని విమర్శ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు మరోసారి విమర్శలు గుప్పించారు. నాలుగున్నరేళ్లుగా బీసీలను అన్ని రకాలుగా హింసించిన జగన్ కు బీసీలపై ఇంకా కసి చల్లారలేదని ఆయన విమర్శించారు. ప్రశాంత్ కిశోర్ చిట్టా ప్రకారం వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయే సీట్లను బీసీలకు కట్టబెట్టి... బీసీలను బలిపశువులను చేయాలని చూస్తున్నాడని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

More Telugu News