Files Theft: పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ చోరీ కేసు.. ముందస్తు బెయిలు కోసం హైకోర్టుకు తలసాని మాజీ ఓఎస్డీ

Talasani OSD Kalyan Approach High Court For Anticipatory Bail

  • గత శుక్రవారం కార్యాలయం గ్రిల్స్ తొలగించి లోపలికి దుండగులు
  • కీలక ఫైళ్లు, హార్డ్‌డిస్క్‌లు మాయమైనట్టు వాచ్‌మన్ ఫిర్యాదు
  • కల్యాణ్ సహా ఐదుగురిపై కేసు నమోదు
  • తనను అరెస్ట్ చేయకుండా బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించిన కల్యాణ్

తెలంగాణ పశుసంవర్ధకశాఖ ఫైల్స్ చోరీ కేసులో ముందస్తు బెయిలు కోరుతూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డీ కల్యాణ్ హైకోర్టును ఆశ్రయించారు. కార్యాలయం నుంచి కీలక ఫైళ్లు మాయమైనట్టు గుర్తించిన కార్యాలయ వాచ్‌మన్ ఫిర్యాదుతో కల్యాణ్ సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ కల్యాణ్ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు.

హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో తలసాని ఓఎస్డీ కల్యాణ్ చాంబర్ ఉంది. గత శుక్రవారం సాయంత్రం ఐదున్నర సమయంలో కిటికీ గ్రిల్స్ తొలగించి కొందరు కార్యాలయంలోకి ప్రవేశించి కీలక పత్రాలతోపాటు హార్డ్‌డిస్క్‌లు కూడా ఎత్తుకెళ్లారు. కార్యాలయ తలుపులు తీసి ఉండడాన్ని గుర్తించిన వాచ్‌మన్ లోపలికి వెళ్లి చూడగా ఫైళ్లు, కంప్యూటర్లు, బీరువాలు చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను కల్యాణ్ ఖండించారు. 

  • Loading...

More Telugu News