Anjani Kumar: ఐపీఎస్ అధికారి అంజనీకుమార్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేసిన ఎన్నికల సంఘం

EC Lifted Suspension Orders on IPS Officer Anjani Kumar

  • ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాకముందే రేవంత్‌రెడ్డిని కలిసిన అంజనీకుమార్
  • ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ సస్పెండ్ చేసిన ఈసీ
  • తాను ఉద్దేశపూర్వకంగా కలవలేదంటూ అంజనీకుమార్ వివరణ
  • సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించిన ఎన్నికల సంఘం

ఐపీఎస్ అధికారి అంజనీకుమార్‌పై విధించిన సస్పెన్షన్‌ను ఎన్నికల సంఘం ఎత్తివేసింది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు పూర్తిగా విడుదల కాకముందే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలిసిన అప్పటి డీజీపీ అంజనీకుమార్ చర్యను ఈసీ తీవ్రంగా పరిగణించి సస్పెండ్ చేసింది.

తనపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరుతూ అంజనీకుమార్ ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఓట్ల లెక్కింపు రోజున తాను ఉద్దేశపూర్వకంగా రేవంత్‌ను కలిసి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించలేదని, రేవంత్ పిలిస్తేనే తాను వెళ్లినట్టు వివరణ ఇచ్చారు. భవిష్యత్తులో మరోమారు ఇలాంటివి జరగవని హామీ ఇచ్చారు. అంజనీకుమార్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీఈసీ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఈ రోజు నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News