Australia: విద్యార్థి, ఉద్యోగ వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్న ఆస్ట్రేలియా

Australia set to make student and workers visa rules hard and stricter

  • ఆస్ట్రేలియా కొత్త ఇమ్మిగ్రేషన్ పాలసీ
  • వలసల పెరుగుదలను అరికట్టేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్యలు
  • ఐదు అంశాల ఆధారంగా నూతన వలస విధానం

దేశంలోకి వలసల పెరుగుదలను అరికట్టేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇకపై విద్యార్థులు, తక్కువ నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు జారీ చేసే వీసాల నిబంధనలు మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది. 

మారిన నిబంధనల ప్రకారం... ఆస్ట్రేలియాలో చదవాలనుకునే విదేశీ విద్యార్థులు ఆంగ్ల భాషా నైపుణ్య పరీక్షల్లో అత్యధిక రేటింగ్ సాధించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఆస్ట్రేలియాలో ఎక్కువ కాలం ఉండేందుకు ఉపకరించే రెండో వీసా దరఖాస్తును ఇకపై మరింత క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. దరఖాస్తులో చిన్న లోపం ఉన్నా, సంబంధిత పత్రాల్లో ఏ కొంచెం తేడా ఉన్నా వీసా నిరాకరించే అవకాశం ఉంటుంది. 

దీనిపై ఆస్ట్రేలియా ప్రభుత్వం వివరణ ఇచ్చింది. తమ నూతన వలస విధానాన్ని ఐదు అంశాల ఆధారంగా రూపొందించామని వెల్లడించింది. ఆస్ట్రేలియన్ల జీవన ప్రమాణాలను పెంపొందించడం, సుహృద్భావ పని వాతావరణం కల్పించడం, అంతర్జాతీయ సంబంధాలు బలోపేతం చేసుకోవడం వీటిలో ముఖ్యమైనవని తెలిపింది. 

ఇప్పటికే ఓ మోస్తరు నైపుణ్యాలతో ఆస్ట్రేలియాలో నెట్టుకొస్తున్న విదేశీయులకు కూడా ఈ వీసా నిబంధనలు ఇబ్బందిగా మారనున్నాయి. కొత్త వీసాలు మంజూరు చేస్తున్న నేపథ్యంలో, ఇప్పటికే తక్కువ నైపుణ్యాలు కలిగినవారి తాత్కాలిక వీసాలు సమీక్షించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

More Telugu News