Ch Malla Reddy: సీఎం రేవంత్ రెడ్డికి ఒకే ఒక్క విజ్ఞప్తి!: మాజీ మంత్రి మల్లారెడ్డి

Former Minister Malla Reddy to CM Revanth Reddy

  • తెలంగాణలో రియాల్టీ ఐటీ రంగాలను కాపాడాలన్న మల్లారెడ్డి
  • కేసీఆర్ ఓడిపోతారని ఎవరూ ఊహించలేదని వ్యాఖ్య
  • కేసీఆర్ మూడు నాలుగు రోజుల్లో డిశ్చార్జ్ కావొచ్చన్న మల్లారెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఓ విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డికి ఒకే ఒక్క విజ్ఞప్తి చేస్తున్నానని... రాష్ట్రంలో ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాలను కాపాడాలని కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ కేసీఆర్ రాష్ట్రాన్ని ఒక మోడల్‌గా తయారు చేశారని కితాబునిచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఓడిపోతారని ఎవరూ భావించలేదన్నారు. ఆయన ఓడిపోయినందుకు అందరూ బాధపడుతున్నట్లు చెప్పారు. కేసీఆర్ ఆరోగ్యం మెరుగుపడుతుందని, మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశముందన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ లేని హైదరాబాద్‌ను ఐటీ ఉద్యోగులు చూడలేకపోతున్నట్లు తెలిపారు.

Ch Malla Reddy
BRS
Revanth Reddy
Telangana
  • Loading...

More Telugu News