Kadiam Srihari: ఎమ్మెల్సీ పదవులకు పల్లా, కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి రాజీనామా

- ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన ముగ్గురు నేతలు
- నిబంధనల ప్రకారం 15 రోజుల్లో ఏదో ఒక పదవికి రాజీనామా సమర్పించాలి
- ఆ స్థానాలకు ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించనున్న ఎన్నికల కమిషన్
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ,స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిలు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. వీరు ముగ్గురు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. నిబంధనల ప్రకారం 15 రోజుల లోపు ఏదో ఒక పదవికి రాజీనామా చేయాలి. అలా ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికల సంఘం ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాను సమర్పిస్తూ.. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి లేఖలు పంపించారు. వారి రాజీనామాలను మండలి చైర్మన్ ఆమోదించారు.
కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి 2021లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందారు. వారి పదవీ కాలం 2027 నవంబర్ వరకు ఉంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 2015లో మొదటిసారి, 2021లో రెండోసారి గెలిచారు. ఆయన పదవీకాలం కూడా 2027 వరకు ఉంది. ఇప్పుడు వీరు ఎమ్మెల్యేలుగా గెలవడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాను సమర్పించారు.