Narendra Modi: సోనియాగాంధీ నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి: మోదీ

Modi greetings to Sonia Gandhi on her birthday

  • ఈరోజు సోనియాగాంధీ పుట్టినరోజు
  • 77వ జన్మదినాన్ని జరుపుకుంటున్న సోనియా
  • రాజకీయాలకు అతీతంగా సోనియాకు వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు

కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈరోజు ఆమె 77వ జన్మదినం. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఆమెకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధాని మోదీ కూడా ఆమెకు గ్రీటింగ్స్ తెలియజేశారు. ఎక్స్ వేదికగా మోదీ స్పందిస్తూ... సోనియాగాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. ఆమెకు సంపూర్ణమైన, ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. మరోవైపు, ఇటీవల కొంత అనారోగ్యానికి గురైన సోనియాగాంధీ పొలిటికల్ గా మళ్లీ యాక్టివ్ అయ్యారు. రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి కూడా ఆమె తరలివచ్చారు.

Narendra Modi
BJP
Sonia Gandhi
Congress
  • Loading...

More Telugu News