Thandel: రేపు నాగచైతన్య 'తండేల్' ఓపెనింగ్... ముఖ్య అతిథులుగా వెంకటేశ్, నాగార్జున

Naga Chaitanya starring Thandel movie opening shot will be take place tomorrow

  • నాగచైతన్య, సాయిపల్లవి జంటగా 'తండేల్'
  • చందూ మొండేటి దర్శకత్వంలో చిత్రం
  • డిసెంబరు 9న ముహూర్తం షాట్
  • అన్నపూర్ణ స్టూడియోస్ లోని గ్లాస్ హౌస్ లో కార్యక్రమం

అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'తండేల్'. 'తండేల్' అంటే ఓ తెగకు నాయకుడు అని అర్థం. మత్స్యకారుల నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం టైటిల్ తోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. కాగా, రేపు (డిసెంబరు 9) 'తండేల్' చిత్రం లాంఛనంగా ప్రారంభం కానుంది. 

హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్ లోని గ్లాస్ హౌస్ లో ఉదయం 10.30 గంటలకు ముహూర్తం షాట్ చిత్రీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగార్జున ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. 

'తండేల్' చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇతర తారాగణం వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

More Telugu News