NPDCL: తెలంగాణలో కొనసాగుతున్న రాజీనామాలు.. పదవి నుంచి తప్పుకున్న ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు

NPDCL CMD Annamaneni Gopal Rao Resign

  • ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శికి రాజీనామా లేఖ
  • ఇన్నేళ్లపాటు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ గోపాల్‌రావు కృతజ్ఞతలు
  • పదవి తనకు సంతృప్తినిచ్చిందని వ్యాఖ్య

తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నత పదవుల్లో ఉన్నవారు వరుసపెట్టి రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు చేరారు. ఆయన నిన్న తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శికి పంపించారు. 

అనంతరం గోపాల్‌రావు మాట్లాడుతూ.. ఈ సుదీర్ఘ ప్రయాణంలో పదవి తనకు చాలా సంతృప్తినిచ్చిందన్నారు. ఇంతకాలం తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఇటీవల ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, సాంస్కృతిక సలహాదారు రమణాచారి రాజీనామా చేశారు. తాజాగా, గోపాల్‌రావు కూడా తప్పుకున్నారు.

NPDCL
Annnamaneni Gopal Rao
Telangana
  • Loading...

More Telugu News