Revanth Reddy: హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం.. భీమవరంలో పండుగ

Revanth Reddy Oath Taking Today Celebrations in Bheemavaram

  • రేవంత్ వియ్యంకుడు వెంకటరెడ్డి ఇంటి వద్ద సందడి
  • బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్న కుటుంబ సభ్యులు
  • ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పండుగ వాతావరణం నెలకొంది. కారణం అది రేవంత్‌రెడ్డి వియ్యంకుడు, రెడ్డి అండ్ రెడ్డి మోటార్స్ షోరూం అధినేత వెంకటరెడ్డి ఊరు కావడమే. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినప్పటి నుంచే వెంకటరెడ్డి ఇంటి వద్ద సందడి మొదలైంది.

నేడు రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనుండడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు నిన్న ఇంటి వద్ద బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు హైదరాబాద్ బయలుదేరారు. రేవంత్‌కు శుభాకాంక్షలు చెబుతూ పట్టణంలోని పలుచోట్ల బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

More Telugu News