Revanth Reddy: 'మీ రేవంత్‌రెడ్డి.. సీఎల్పీ నాయకుడు' అంటూ ప్రజలకు కాబోయే ముఖ్యమంత్రి లేఖ

Revanth Reddy letter to people of telangana

  • తెలంగాణ ప్రజలను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తూ రేవంత్ రెడ్డి లేఖ
  • రేపు మధ్యాహ్నం గం.1:04 కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వెల్లడి
  • విద్యార్థుల పోరాటం, సోనియా ఉక్కు సంకల్పంతో తెలంగాణ ఏర్పడిందని వ్యాఖ్య

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానిస్తూ లేఖ రాశారు. ప్రజా ప్రభుత్వ స్వీకారానికి ఆహ్వానం పలుకుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన బుధవారం లేఖను విడుదల చేశారు. తెలంగాణ ప్రజలకు అభినందనలు... విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేరే ఇందిరమ్మ రాజ్యస్థాపనకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక పాలన అందించేందుకు బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనార్టీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మీ అందరి ఆశీస్సులతో 2023 డిసెంబర్ 7న మధ్యాహ్నం 1.04 గంటలకు ఎల్బీ స్టేడియంలో ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతుందన్నారు. ఈ మహోత్సవానికి రావాల్సిందిగా అందరికీ ఆహ్వానం పంపుతున్నామని పేర్కొన్నారు.

Revanth Reddy
Telangana Assembly Results
Congress
  • Loading...

More Telugu News