Revanth Reddy: ముఖ్యమంత్రిగా ఆమెకు తొలి ఉద్యోగం... రేపు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి సంతకం

Revanth Reddy first sign on this papers as cm
  • కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దివ్యాంగురాలికి ఉద్యోగం ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ
  • ఈ మేరకు యువతికి గ్యారెంటీ కార్డుపై సంతకం చేసిచ్చిన రేవంత్ రెడ్డి
  • రేపు ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో మొదటి ఉద్యోగాన్ని ఓ దివ్యాంగురాలికి ఇవ్వనుంది. రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రేవంత్ రెడ్డి... రజని అనే యువతికి ఉద్యోగం ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆమెకు ఆహ్వానం పంపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం నీకే ఇస్తామంటూ గత అక్టోబర్ నెలలో రజనికి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తాను పీజీ పూర్తి చేసినప్పటికీ ప్రయివేటు లేదా ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

రజని నాంపల్లికి చెందిన యువతి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే రోజున సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే వస్తారని..  వారి సమక్షంలోనే ఉద్యోగం ఇస్తామని ఆమెకు రేవంత్ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆమెకు రేవంత్ రెడ్డి గ్యారెంటీ కార్డును రాసి ఇచ్చారు. రేపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రజనికి ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రమాణ స్వీకారానికి రజనికు కూడా అహ్వానం పంపించారు.
Revanth Reddy
Congress
Telangana Assembly Results

More Telugu News