KCR: కేసీఆర్ ను కలిసేందుకు ఫామ్ హౌస్ కు వెళ్లిన చింతమడక గ్రామస్తులు

Chinthamadaka villagers went to KCR farm house

  • ఎన్నికల ఫలితాల తర్వాత ఫామ్ హౌస్ కు వెళ్లిపోయిన కేసీఆర్
  • బయట కార్యక్రమాల్లో పాల్గొనని బీఆర్ఎస్ అధినేత
  • చింతమడక గ్రామస్తులను తొలుత ఫామ్ హౌస్ లోకి అనుమతించని పోలీసులు

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైన తర్వాత ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన అక్కడి నుంచి బయటకు రాలేదు. బయట కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఆయన ఫామ్ హౌస్ లోనే సమావేశమయ్యారు. మరోవైపు, ఆయన స్వగ్రామమైన చింతమడక గ్రామస్తులు కేసీఆర్ ను కలిసేందుకు ఫామ్ హౌస్ కు వెళ్లారు. దాదాపు 540 మంది గ్రామస్తులు 9 బస్సులు, 10 కార్లలో ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. అయితే, వీరిని పోలీసులు చెక్ పోస్ట్ వద్దే ఆపేశారు. అనుమతి ఉంటేనే లోపలకు అనుమతిస్తామని వారికి స్పష్టం చేశారు. దాదాపు 2 గంటల సేపు వేచి ఉన్న తర్వాత వారికి ఫామ్ హౌస్ లోకి వెళ్లేందుకు అనుమతి వచ్చింది. ప్రస్తుతం కేసీఆర్ తో చింతమడక గ్రామస్తులు మాట్లాడుతున్నారు.

  • Loading...

More Telugu News