Lawrence: లోకేశ్ కనగరాజ్ మేజిక్ .. రజనీతో తలపడే విలన్ గా లారెన్స్?

- లోకేశ్ కనగరాజ్ కి రజనీ గ్రీన్ సిగ్నల్
- త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ప్రాజెక్టు
- రజనీ సినిమాలో లారెన్స్ కి దక్కిన ఛాన్స్
- ఖుషీ అవుతున్న లారెన్స్
'జైలర్' సినిమా రజనీకాంత్ విశ్వరూపాన్ని మరోసారి ఆవిష్కరించింది. వసూళ్ల పరంగా ఆ సినిమా కొత్త రికార్డులను నమోదు చేసింది. ఓటీటీలోను ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోతుండటం విశేషం. ఈ సినిమా తరువాత ప్రాజెక్టులను రజనీ చాలా ఫాస్టుగా లైన్లో పెట్టేశారు. ప్రస్తుతం ఆయన జ్ఞానవేల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.
ఆ తరువాత సినిమాను లోకేశ్ కనగరాజ్ తో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాలో విలన్ గా లారెన్స్ పేరు వినిపిస్తోంది. లోకేశ్ ఇంతవరకూ చేస్తూ వచ్చిన సినిమాలు చూస్తే, హీరో - విలన్ రోల్స్ ను ఆయన ఎంత పవర్ఫుల్ గా డిజైన్ చేస్తాడనేది అర్థమవుతుంది. అదే పద్ధతిని ఆయన ఈ సినిమా విషయంలోనూ ఫాలో అవుతున్నాడని అంటున్నారు.
