Revanth Reddy: ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి.. కేసీ వేణుగోపాల్ ప్రకటన

KC Venugopal announces Revanth Reddy as CM

  • సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నట్లు ప్రకటించిన కేసీ వేణుగోపాల్
  • ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడి
  • సీనియర్లందరికీ ప్రాధాన్యత ఉంటుందని... టీమ్ వర్క్ చేస్తారని వ్యాఖ్య

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. రెండు రోజుల చర్చోపచర్చల అనంతరం ఈ రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని కొత్త ముఖ్యమంత్రిగా ప్రకటించారు. 

ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికకు సంబంధించి నిన్న సీఎల్పీ భేటీ జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా రేవంత్ రెడ్డిని ఖరారు చేసినట్లు తెలిపారు. ఎల్లుండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. సీనియర్లందరికీ ప్రాధాన్యత ఉంటుందన్నారు. అందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు అందరూ టీమ్ వర్క్ చేస్తారని చెప్పారు. సీఎల్పీ సమావేశంలో మూడు తీర్మానాలు చేసినట్లు వెల్లడించారు.

Revanth Reddy
Telangana Assembly Results
Congress
kc venugopal
  • Loading...

More Telugu News