Revanth Reddy: జాగృతి పత్రికలో రేవంత్ రెడ్డి జర్నలిస్ట్‌గా పనిచేసినప్పటి ఫొటో నెట్టింట వైరల్

Revanth Reddy photo viral in social media

  • ముప్పై ఏళ్ల క్రితం జాగృతి పత్రికలో పని చేశారంటూ ఫొటో
  • మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఉన్న రేవంత్ రెడ్డి
  • కాంగ్రెస్ నుంచి బీజేపీ కార్యకర్తల వరకు ఫొటోను షేర్ చేస్తున్న వైనం

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఆయన రాజకీయాల్లోకి వచ్చి దాదాపు ఇరవై ఏళ్లు కూడా కాలేదు. 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ తర్వాత నాలుగేళ్లకు ఆ పార్టీ అధ్యక్షుడు అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ఆయనదే ఎక్కువ పాత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన పాత ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫొటోలో నల్లటి షర్ట్ వేసుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి.

ముప్పై ఏళ్ల క్రితం ఆయన జాగృతి పత్రికలో పని చేశారంటూ ఈ ఫొటో వెలుగుచూసింది. ఆ ఫొటోలో అదే జాగృతిలో పని చేసిన మరో ముగ్గురు స్నేహితులు కూడా ఉన్నారు. ఈ ఫొటోను రేవంత్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు షేర్ చేస్తున్నారు. ఏబీవీపీ నేతగా... ఆరెస్సెస్ అనుబంధ పత్రిక జాగృతిలో పని చేశారంటూ బీజేపీ కార్యకర్తలు కూడా గుర్తు చేసుకుంటూ ఫొటోను షేర్ చేస్తున్నారు. జర్నలిస్ట్‌గా ప్రారంభమైన ఆయన కెరీర్.. రాజకీయ నాయకుడిగా ఎదిగి.. ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు పేర్కొంటున్నారు.

Revanth Reddy
Telangana Assembly Results
jagruthi
  • Loading...

More Telugu News