Kalvakuntla Kavitha: కాంగ్రెస్ విజయంపై కవిత స్పందన

Kalvakuntla Kavitha reaction on Congress victory
  • తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 64 సీట్లు
  • శుభాకాంక్షలు తెలిపిన కల్వకుంట్ల కవిత
  • ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎంతో శ్రమించారని కితాబు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లతో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం అందుకుంది. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేశారు. గెలిచిన ఎమ్మెల్యేలందరికీ అభినందనలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎంతో శ్రమించారని కొనియాడారు. 

అధికారంలో ఉన్నా, లేకపోయినా మనందరం తెలంగాణ ప్రజలకు సేవకులమేనని పేర్కొన్నారు. తెలంగాణ మన మాతృభూమి... రాష్ట్రం కోసం మనస్ఫూర్తిగా పాటుపడదాం అని పిలుపునిచ్చారు. కాగా, కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ విజయం సాధించారు. సంజయ్ కుమార్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ పై నెగ్గారు. దీనిపై కవిత స్పందించారు. కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. 
Kalvakuntla Kavitha
BRS
Congress
Telangana Assembly Election

More Telugu News