Narendra Modi: తెలంగాణతో మా బంధం విడదీయరానిది: ప్రధాని మోదీ

PM thanks to telangana people

  • ప్రియమైన తెలంగాణ సోదర సోదరీమణులారా అంటూ ట్వీట్
  • బీజేపీకి మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు అని పేర్కొన్న ప్రధాని
  • రాబోయే కాలంలో ఈ మద్దతు కొనసాగుతుందని ఆకాంక్ష

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికిన ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 'నా ప్రియమైన తెలంగాణ సోదర సోదరీమణులారా, మీరు బీజేపీకి ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు. గత కొన్ని సంవత్సరాలుగా మీ మద్దతు పెరుగుతూనే ఉంది... ఈ సరళి రాబోయే కాలంలో కూడా కొనసాగుతోంది. తెలంగాణతో మా బంధం విడదీయరానిది, ప్రజల కోసం మేము పని చేస్తూనే ఉంటాం. ప్రతి బీజేపీ కార్యకర్త చేసిన అపార కృషిని నేను అభినందిస్తున్నాను.' అని ట్వీట్ చేశారు.

Narendra Modi
Telangana Assembly Results
BJP
  • Loading...

More Telugu News