Ch Malla Reddy: ఎదురుగాలిలోనూ గెలిచిన మంత్రి మల్లారెడ్డి

Minister Malla Reddy wins Medchal constituency

  • తెలంగాణలో అత్యధిక ప్రాంతాల్లో గులాబీకి వ్యతిరేక పవనాలు
  • మేడ్చల్ లో విజేతగా నిలిచిన మల్లారెడ్డి
  • 9 వేల ఓట్ల తేడాతో నెగ్గిన మంత్రి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ఓటమి దిశగా పయనిస్తోంది. ఎర్రబెల్లి, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి వెనుకంజలో ఉండగా... మంత్రి చామకూర మల్లారెడ్డి విజయం సాధించారు. రాష్ట్రంలో అత్యధిక ప్రాంతాల్లో గులాబీ పార్టీకి ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ ఆయన మేడ్చల్ నియోజకవర్గం నుంచి విజేతగా నిలిచారు. మల్లారెడ్డి దాదాపు 9 వేల ఓట్ల ఆధిక్యంతో సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. 

కాగా, ఇతర మంత్రులు కేటీఆర్ (సిరిసిల్ల), తలసాని శ్రీనివాస్ యాదవ్ (సనత్ నగర్), హరీశ్ రావు (సిద్ధిపేట), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం) ముందంజలో ఉన్నారు.

Ch Malla Reddy
Medchal
BRS
Assembly Election
Telangana
  • Loading...

More Telugu News