Revanth Reddy: కాసేపట్లో గాంధీభవన్ కు రేవంత్ రెడ్డి

Revanth Reddy will come to Gandhi Bhavan shortly
  • తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా
  • ఇప్పటివరకు 3 స్థానాల్లో నెగ్గి, 62 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్
  • గెలుపు సంబరాలు మొదలుపెట్టిన కాంగ్రెస్ శ్రేణులు
  • మధ్యాహ్నం ఒంటి గంటకు గాంధీభవన్ కు రేవంత్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 స్థానాలు ఉండగా... ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 60 స్థానాలు. ఇప్పటికే 3 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్... మరో 62 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరికాసేపట్లో గాంధీభవన్ కు చేరుకోనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ వర్గాలు గెలుపు సంబరాలు షురూ చేశాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు గాంధీభవన్ కు చేరుకోనున్న రేవంత్ రెడ్డి ఫలితాలను సమీక్షించడంతో పాటు కార్యకర్తలతో కలిసి సంబరాల్లో పాల్గొననున్నారు. ప్రస్తుతం ఆయన తన నివాసం నుంచి భారీ ర్యాలీగా గాంధీభవన్ కు బయల్దేరారు. 
Revanth Reddy
Gandhi Bhavan
Congress
Assembly Election
Telangana

More Telugu News