Vijaykanth: విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత ఇచ్చిన అర్ధాంగి ప్రేమలత

Premalatha reacts to news on her husband Vijaykanth
  • అనారోగ్యంతో బాధపడుతున్న విజయ్ కాంత్
  • నవంబరు 18న ఆసుపత్రిలో చేరిక
  • వెంటిలేటర్ పై ఉన్నారంటూ కథనాలు
  • ఖండించిన విజయ్ కాంత్ అర్ధాంగి ప్రేమలత
  • దయచేసి తప్పుడు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి
దేశీయ ముర్పోక్కు ద్రవిడ కళగం (డీఎండీకే) పార్టీ అధినేత, నటుడు విజయ్ కాంత్ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందంటూ ఇటీవల కథనాలు వచ్చాయి. విజయ్ కాంత్ వెంటిలేటర్ పై ఉన్నారంటూ ప్రచారం జరిగింది. ఇలాంటి వార్తలపై విజయ్ కాంత్ అర్ధాంగి ప్రేమలత విచారం వ్యక్తం చేశారు. 

విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై ఆమె తాజాగా స్పష్టత ఇచ్చారు. విజయ్ కాంత్ కోలుకుంటున్నారని వెల్లడించారు. త్వరలోనే ఆరోగ్యవంతులై ఆసుపత్రి నుంచి ఇంటికి వస్తారని తెలిపారు. అంతేకాదు, విజయ్ కాంత్ ఫొటోను కూడా పంచుకున్నారు. తన భర్త ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయడం బాధ కలిగిస్తోందని, దయచేసి ఎవరూ వదంతులు వ్యాపింపజేయవద్దని ప్రేమలత విజ్ఞప్తి చేశారు. 

విజయ్ కాంత్ నవంబరు 18న అనారోగ్యం కారణంగా చెన్నైలోని మియాట్ హాస్పిటల్ లో చేరారు. దాంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Vijaykanth
Health
Premalatha
DMDK
Chennai
Tamil Nadu

More Telugu News