Palnadu: ఎదురింటి వ్యక్తితో గొడవ.. సీసీరోడ్డుపై మూడు అడుగుల ఎత్తులో గోడ కట్టేశాడు!

Man built wall between CC Road in Palandu district

  • పల్నాడు జిల్లా, శావల్యాపురం మండలం కారుమంచిలో ఘటన
  • పొరుగింటి వ్యక్తి రోడ్డుపైకి మెట్లు కట్టడంపై అభ్యంతరం
  • అతడు మురుగు కాల్వపై మెట్లు కట్టడంపై ఈయన అభ్యంతరం
  • చివరికి రోడ్డుపై వెలసిన గోడ

ఇరుగుపొరిగిళ్ల మధ్య మనస్పర్థలు, చిన్నపాటి గొడవలు సర్వసాధారమే. కొన్ని సందర్భాల్లో మాత్రం ఇవి కక్షలు కార్పణ్యాలకు దారితీస్తుంటాయి. పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కారుమంచిలో మాత్రం ఈ గొడవ ఏకంగా రాష్ట్రం దృష్టిని ఆకర్షించింది. గ్రామానికి చెందిన కిలారు లక్ష్మీనారాయణ, కిలారు చంద్రశేఖర్ ఇళ్లు ఎదురెదురుగా ఉన్నాయి. మధ్యలో సీసీరోడ్డు ఉంది. 

లక్ష్మీనారాయణ తన ఇంటి మెట్లను రోడ్డుపైకి వచ్చేలా కట్టడంతో చంద్రశేఖర్ అభ్యంతరం తెలిపాడు. ఆ తర్వాత ఈ గొడవ పోలీసుల వద్దకు, గ్రామ పెద్దల వద్దకు చేరింది. చివరికి పంచాయతీ సిబ్బంది ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. చంద్రశేఖర్ ఇటీవల తన ఇంటిముందున్న మురుగుకాల్వపై మెట్లు కట్టాడు. నిరసనగా లక్ష్మీనారాయణ ఏకంగా సీసీ రోడ్డు మధ్యలో మూడు అడుగుల ఎత్తులో పొడవుగా గోడకట్టేశాడు. దీంతో చిన్న గొడవ కాస్తా పెద్దదిగా మారి ఏకంగా రాష్ట్రం దృష్టినే ఆకర్షించింది. రోడ్డు మధ్యలో గోడ కట్టినప్పటికీ అధికారులు ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం.

Palnadu
Andhra Pradesh
CC Road
Savalyapuram
Karumanchi

More Telugu News