R Subbalakshmi: దక్షిణాది సీనియర్ నటి సుబ్బలక్ష్మి కన్నుమూత

Veteran actor R Subbalakshmi dies at 87 in Kochi
  • తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సినిమాల్లో నటించిన సుబ్బలక్ష్మి
  • 87 ఏళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూత
  • ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించిన మనవరాలు సౌభాగ్య వెంకటేశ్
  • సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి
పలు తెలుగు, తమిళ, మలయాళంతోపాటు బాలీవుడ్‌లోనూ నటించి తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ సీనియర్ నటి ఆర్.సుబ్బలక్ష్మి నిన్న కేరళలోని కొచ్చిలో కన్నుమూశారు. ఆమె వయసు 87 సంవత్సరాలు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం ఆమె మృతి చెందినట్టు మనవరాలు సౌభాగ్య వెంకటేశ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. సుబ్బలక్ష్మి మరణవార్త విని సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది.

దాదాపు 75 సినిమాల్లో నటించిన సుబ్బలక్ష్మి కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన ‘బీస్ట్’ మూవీతోపాటు, తెలుగులో అక్కినేని నాగచైతన్య నటించిన ‘ఏమాయ చేశావే’లోనూ నటించారు. పలు సీరియళ్లలోనూ నటించిన ఆమె ఎన్నో వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపించారు. 

చిత్ర పరిశ్రమలోకి రాకముందు జవహర్ బాలభవన్‌లో సంగీత, నాట్య శిక్షకురాలిగా పనిచేశారు. ఆల్ ఇండియా రేడియోలోనూ సేవలందించారు. రేడియోలో దక్షిణాది నుంచి వచ్చిన తొలి మహిళా కంపోజర్‌గా రికార్డులకెక్కారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌నూ సుబ్బలక్ష్మి పనిచేశారు.
R Subbalakshmi
Malayalam
Kollywood
Tollywood

More Telugu News