Revanth Reddy: కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని అడ్డుకున్న బీఆర్ఎస్... ఉద్రిక్తత

BRS stopped Revanth Reddy in Kamareddy

  • కామారెడ్డిలో తలపడుతున్న కేసీఆర్, రేవంత్ రెడ్డి
  • బూత్ వైజ్ పోలింగ్ స్టేషన్లను విజిట్ చేస్తున్న రేవంత్ ను అడ్డుకున్న వైనం
  • హోరాహోరీగా నినాదాలు చేసిన ఇరు వర్గాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కాసేపట్లో ముగియనుంది. ఈనాటి పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయులు పలు చోట్ల ఘర్షణకు దిగారు. మరోవైపు కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బూత్ వైజ్ పోలింగ్ స్టేషన్లను రేవంత్ రెడ్డి విజిట్ చేస్తుండగా ఆయనను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా ఇరు వర్గాలు హోరాహోరీగా నినాదాలు చేశాయి. వెంటనే రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. దీంతో, అక్కడి పరిస్థితి అదుపులోకి వచ్చింది. 

More Telugu News